Saturday, November 23, 2024
HomeNewsIND vs AUS: రెండో రోజు ముగిసిన ఆట.. భారీ ఆధిక్యంలో భారత్

IND vs AUS: రెండో రోజు ముగిసిన ఆట.. భారీ ఆధిక్యంలో భారత్

IND vs AUS: బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. 46 పరుగుల ఆధిక్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ధాటిగా ఆడింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్(KL Rahul) , యశస్వి జైశ్వాల్(Yashasvi Jaiswal)హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ ముందుకు నడిపించారు. దీంతో రెండో ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా టీమిండియా 172 పరుగులు చేసింది. రాహుల్ 62 పరుగులు చేయగా.. జైశ్వాల్ 90 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఒక్క వికెట్ కూడా కోల్పోకపోవడంతో భారత్ 218 పరుగుల ఆధిక్యంతో పటిష్ట స్థితిలో ఉంది.

- Advertisement -

అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ 67/7 పరుగుల వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ జట్టును టీమిండియా బౌలర్లు తీవ్ర ఇబ్బందులు పెట్టారు. ఈ క్రమంలోనే వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే బౌలర్ మిచెట్ స్టార్ భారత బౌలర్లను అడ్డుకుంటూ 26 పరుగులు చేశాడు. చివరి వికెట్‌కు హేజిల్‌వుడ్‌తో కలిసి స్కోర్ బోర్డు కాస్త ముందుకు తీసుకెళ్లాడు. అయితే హర్షిత్ రాణా స్టార్క్‌ను ఔట్ చేయడంతో ఆస్ట్రేలియా 104 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో టీమిండియాకు 46 పరుగుల ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు, హర్షిత్ రాణా 3, సిరాజ్ 2 వికెట్లు తీశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News