Saturday, November 23, 2024
HomeతెలంగాణMLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఈజ్ బ్యాక్.. రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఈజ్ బ్యాక్.. రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం

లిక్కర్ కేసులో అరెస్ట్ అయి బెయిల్‌పై బయటకు వచ్చిన బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(Kavitha) మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్‌గా మారుతున్నారు. ఇకపై రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆమె డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న విద్యార్థినిని పరామర్శించారు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స విద్యార్థిని శైలజ కుటుంసభ్యులకు ధైర్యం చెప్పారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలల విద్యార్థుల ప్రాణాలు కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) కనీసం 10 నిమిషాలైనా సమయం కేటాయించాలని తెలిపారు. వెంటిలేటర్ పై ఉన్న విద్యార్థిని పరామర్శించడం బాధాకారంగా ఉందన్నారు. ఫుడ్ పాయిజన్ , కరెంట్ షాక్‌తో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 11 నెలల పాలనలో 42 మంది విద్యార్థులు మృతి చెందడం దారుణమని ఆమె మండిపడ్డారు. ఏకంగా 42 మంది విద్యార్థులు మృత్యువాత పడితే ఈ ప్రభుత్వానికి ఎందుకింత నిర్లక్ష్యమని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News