Duvvada Srinivas| గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan)పై ఆ పార్టీ నేతలు ఇష్టానుసారం విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కొంతమంది ఆయన కుటుంబం గురించి వ్యక్తిగత విమర్శలు చేస్తే.. మరికొందరేమో ఆయన రాజకీయ ప్రస్థానంపై విమర్శలు చేసేవారు. ఈ కోవలోకే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వస్తారు. అప్పటి సీఎం జగన్(Jagan)తో పాటు వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తూ చెప్పులు చూపించారు. ఇందుకు కౌంటర్‌గా దువ్వాడ సైతం పవన్‌కు చెప్పులు చూపించారు. దీనిపై జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదుచేయగా.. అప్పుడు కేసు నమోదు చేయలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మరోసారి దువ్వాడ శ్రీనివాస్‌పై జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు అయనపై కేసు నమోదు చేశారు.
పోలీసుల కేసుపై తాజాగా దువ్వాడ స్పందించారు. తమ అధినేత జగన్‌కి చెప్పు చూపించి పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. అందుకే తాను కూడా చెప్పులు చూపించానని తెలిపారు. తాను రెండేళ్ల క్రితం విమర్శలు చేస్తే ఇప్పుడు కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా బెదిరేది లేదని దువ్వాడ పేర్కొన్నారు.