Saturday, November 23, 2024
HomeతెలంగాణAccreditations | 'చిన్న పత్రికలకు ఖచ్చితంగా అక్రిడిటేషన్లు ఇవ్వాలి'

Accreditations | ‘చిన్న పత్రికలకు ఖచ్చితంగా అక్రిడిటేషన్లు ఇవ్వాలి’

చిన్న పత్రికలకు అన్యాయం చేయొద్దని తెలంగాణ రాష్ట్ర చిన్న మధ్య తరహా అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ అధ్యక్షులు యూసుఫ్ బాబు డిమాండ్ చేశారు. అక్రిడిటేషన్లు (Accreditations) గతంలో ఉన్న మాదిరిగానే ఐ అండ్ పిఆర్ నుంచి ఖచ్చితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. శనివారం బషీర్ బాగ్ లోని దేశోద్ధారక భవన్ లో అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన యూసుఫ్ బాబు మాట్లాడుతూ… చిన్న పత్రికల మనుగడను ప్రశ్నార్థకం చేసేలా కొందరు అధికారులు కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కుట్రలు తిప్పికొట్టేందుకు అందరూ సమైక్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.

- Advertisement -

అక్రిడిటేషన్ లను (Accreditations) అమ్ముతున్నామన్న ప్రచారం అవాస్తవం యూసుఫ్ బాబు అన్నారు. అలాంటి వాళ్ళను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలో రానున్న అక్రిడిటేషన్ల నూతన జీవోపై ఇప్పటినుంచి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. వెంటనే ఐ అండ్ పి ఆర్ కమిషనర్, మీడియా అకాడమీ చైర్మన్లను కలిసి అక్రిడేషన్ల విషయమై చర్చించాలని తెలిపారు. పాత జీవోలో ఉన్న గ్రేడింగ్ల విధానం కాకుండా నూతనంగా చిన్న పత్రికలకు న్యాయం చేసే విధంగా రావాలని ఆకాంక్షించారు. ఎందుకు అవసరమైతే పోరాటాలకు సిద్ధంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Also Read : కొడంగల్ లో ఫార్మాసిటీ ఏర్పాటు చేయట్లేదు.. తేల్చేసిన సీఎం

కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలను చేసినట్లు సంఘం ప్రధాన కార్యదర్శి అశోక్ తెలిపారు. సోమవారం సంఘం సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చి సమస్యలపై ఐ అండ్ పి ఆర్ కమిషనర్, అధికారులను కలిసి వినతిపత్రం అందజేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు,
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు, హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్నగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, కొమరం భీం తదితర జిల్లాల నుండి పత్రికల సంపాదకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News