రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), నేషనల్ క్రష్ రష్మిక(Rashmika) మందన్నా కలిసి మరోసారి కెమెరాకు చిక్కారు. వీరిద్దరూ కలిసి ఓ రెస్టారెంట్లో భోజనం చేస్తున్న ఫొటోను ఎవరో సీక్రెట్‌గా తీశారు. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొన్ని రోజుల నుంచి ఈ జంట రిలేషన్లో ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే తాము మంచి స్నేహితులమని ఇద్దరు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. కానీ ఓ ఇంటర్వ్యూలో మాత్రం బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే మాట్లాడుతూ విజయ్-రష్మిక ప్రేమలో ఉన్నారంటూ హింట్ ఇచ్చింది. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
అలాగే తాజాగా తన మ్యూజిక్ ఆల్బమ్ ‘సాహిబా’ ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ దేవరకొండ తన రిలేషన్షిప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సింగిల్ కాదని.. కోస్టార్‌తో డేటింగ్లో ఉన్నానని చెప్పారు. విజయ్ వ్యాఖ్యలు వైరల్‌గా మారిన తరుణంలో ఈ ఫొటో బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. వీరు కచ్చితంగా రిలేషన్లో ఉన్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కాగా గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో వీరిద్దరు కలిసి నటించారు. వీరి జంటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్నారు. రష్మిక ‘పుష్ప ది రూల్’ చిత్రంలో నటించారు. అలాగే ‘కుబేర’ చిత్రంలోనూ యాక్ట్ చేస్తున్నారు.