గౌతమ్ అదానీ (Gautam Adani) అమెరికా కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోలార్ ప్రాజెక్టులు దక్కించుకోవడానికి లంచాలు ఇచ్చినట్టు అమెరికాలో అదానీ, అతని బంధువుతోపాటు పలువురిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై వివరణ ఇవ్వాలని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ గౌతమ్ అదానీ, ఆయన సోదరుడి కుమారుడైన సాగర్ అదానీకి సమన్లు పంపింది.
- Advertisement -
అహ్మదాబాద్ లోని గౌతమ్ అదానీ (Gautam Adani) శాంతివన్ ఫామ్ హౌస్, అదానీ సోదరుడు సాగర్‌కు చెందిన బోదక్ దేవ్ నివాసానికి నోటీసులు ఆ సంస్థ నోటీసులు పంపింది. లంచం ఆరోపణలపై 21 రోజుల్లో సమాధానం తెలియజేయాలని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ నోటీసుల్లో పేర్కొంది.