Sunday, November 24, 2024
HomeఆటRishabh Pant: ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు ధర పలికిన రిషబ్ పంత్

Rishabh Pant: ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు ధర పలికిన రిషబ్ పంత్

Rishabh Pant| అందరూ అనుకున్నట్లే జరిగింది. ఐపీఎల్ వేలం(IPL Auction)లో భారత యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌ రికార్డు ధర పలికాడు. దీంతో ఐపీఎల్ టోర్నీలోనే అత్యధిక ధర దక్కించుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. పంత్ పేరు వేలంలోకి రాగానే లక్నో, ఆర్సీబీ, హైదరాబాద్ జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. ఓ దశలో రూ.20కోట్ల వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ పంత్‌ను సొంతం చేసుకునే దిశగా కనపడింది. అయితే లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా రూ.27 కోట్లకు పంత్‌ను దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ టోర్నీలోనే రికార్డు ధర పలికిన ఆటగాడిగా పంత్ చరిత్ర సృష్టించాడు.

- Advertisement -

అంతకుముందు భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ (Shreyas Iyer) కూడా భారీ ధర పలికాడు. పంజాబ్‌ కింగ్స్‌ రూ.26.75 కోట్లకు శ్రేయస్‌ను సొంతం చేసుకుంది. అయ్యర్ కోసం కోల్‌కతా, ఢిల్లీ పోటీపడ్డాయి. తర్వాత రేసులోకి వచ్చిన పంజాబ్‌ చివరకు రూ.26.75 కోట్లకు దక్కించుకుంది. ఇక కనీస ధర రూ.2 కోట్లు ఉన్న భారత పేసర్ అర్ష్‌దీప్‌ సింగ్‌ను కూడా రూ.18 కోట్లకు పాడుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్, బెంగళూరు, రాజస్థాన్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, పంజాబ్ కింగ్స్‌ జట్లు అతడి కోసం పోటీపడ్డాయి. చివరకు రైట్ టూ మ్యాచ్(RTM)‌ కార్డును ప్రయోగించి పంజాబ్ రూ.18 కోట్లకు అర్ష్‌దీప్‌ను సొంతం చేసుకుంది. అలాగే టీమ్‌ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను రూ.18 కోట్లకు పంజాబ్‌ తీసుకుంది.

అలాగే కనీస ధర రూ. 2 కోట్లు ఉన్న సౌతాఫ్రికా పేసర్ కగిసో రబాడను రూ.10.75 కోట్లకు గుజరాత్ టైటాన్స్‌ సొంతం చేసుకోగా.. ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌ను రూ.15.75 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. సౌతాఫ్రికా హిట్టర్ డేవిడ్ మిల్లర్‌ను రూ.7.5 కోట్లకు లక్నో దకించుకుంది. కనీస ధర రూ. 2కోట్లు ఉన్న మహ్మద్‌ షమిని రూ.10 కోట్లకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్ దక్కించుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News