యాత్రా స్థలాలు, టూరిజం ప్రాంతాలకు వెళ్లే వారి కోసం భారతీయ రైల్వే ది గోల్డెన్ చారియట్ (The Golden Chariot) లగ్జరీ పేరుతో కొత్త టూరిస్టు రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. అధునాతనంగా నిర్మించిన కోచ్ లు, అదిరిపోయే లగ్జరీ వసతులతో ఈ రైళ్లు అత్యంత సుఖవంతమైన ప్రయాణాన్ని అందించనున్నాయి. ఐఆర్సీటీసీ–రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ రైలు కొత్త అవతార్‌లో ట్రాక్‌పైకి రావడానికి సిద్ధంగా ఉంది.
సదుపాయాలు ఇలా…
ది గోల్డెన్ చారియట్ (The Golden Chariot) రైలు లో 13 డబుల్ బెడ్‌ల క్యాబిన్‌లు, 26 ట్విన్ బెడ్‌డ్ క్యాబిన్‌లు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఒక క్యాబిన్ ప్రపంచ స్థాయి ఆన్-బోర్డ్ వసతిని అందిస్తుంది. 40 క్యాబిన్లలో గరిష్టంగా 80 మంది అతిథులకు వసతి కల్పిస్తుంది. ఇందులో ఆధునాతన ఫర్నీచర్ తో రూపొందించిన విలాసవంతమైన క్యాబిన్లు, సొగసైన డ్రేపరీ, అటాచ్డ్ మాడ్రన్ బాత్‌రూమ్‌లు, అంతర్జాతీయ బ్రాండ్‌ల క్రాకరీ వంటి అనేక అధునాతమైన అదిరిపోయే సౌకర్యాలు ఈ రైలులో అందిస్తున్నారు.
అంతేకాకుండా ప్రయాణికులకు అద్బుతమైన వినోదాన్ని అందించడానికి ప్రతి క్యాబిన్లో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశారు. ఈ స్మార్ట్ టీవీలకు వైఫై సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ప్రయాణికులు నెట్ ఫ్లిక్, ఆమేజాన్, హాట్ స్టార్ వంటి చానళ్లతో పాటు ఇతర వందకు పైగా ఎంటర్టైన్మెంట్, న్యూస్, ఇతర చానళ్లు చూడవచ్చు. రైలులో సీసీకెమెరాలు, ఫైర్ సేఫ్టీ పరికాలు ఏర్పాటు చేశారు. ప్రయాణికుల కోసం రైలులో ప్రత్యేకంగా స్పా ఆరోగ్య స్పా థెరపీలతో సహా అనేక రకాల స్పా థెరపీలను ఆస్వాదించవచ్చు. స్పాలో ఫిట్‌నెస్ ఔత్సాహికుల కోసం ఆధునిక వ్యాయామ యంత్రాలు కూడా ఉన్నాయి.
రెండు రెస్టారెంట్లు… రుచికరమైన ఫుడ్… ఇష్టమైన ఆల్కహాల్
ది గోల్డెన్ చారియట్ (The Golden Chariot) రైలులో ప్రయాణికుల కోసం ‘రుచి’, ‘నలపాక’ అనే రెండు రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు. ఇవి అంతర్జాతీయ మరియు స్థానిక రుచికరమైన వంటకాలను అందిస్తాయి. ప్రయాణికులు ఈ రెస్టారెంట్లకు వెళ్లి తమకు ఇష్టమైన వంటకాలను ఆరగించవచ్చ. అలాగే తమకు ఇష్టమైన బీర్లు, వైన్స్ తాగవచ్చు. ఇవన్నీ ప్రయాణికుల టికెట్ ధరలో చేర్పబడి ఉంటాయి.
ఐదు రోజుల యాత్రా ప్యాకేజీ రూ.4లక్షల530లు..
ఈ యాత్ర స్పెషల్ రైటులో టికెట్, భోజనం, మద్యం, సందర్శనా స్థలాలతో సహా, ప్రవేశ టిక్కెట్లు, గైడ్, లోకల్ ట్రావెల్ చార్జీలు అన్నికలుపుకుని ఐదు రోజుల ప్యాకేజీకి గాను ఒక్కో ప్రయాణికుడు రూ.2లక్షల నుంచి రూ.4లక్షల530ల తోపాటు 5శాతం అదనంగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ప్రైడ్ ఆఫ్ కర్నాటక పేరుతో ఐదు రోజుల యాత్ర ఉంటుంది.
టూరిస్ట్ డెస్టినేషన్స్
రైలు బెంగళూరులో ప్రారంభమై బందీపూర్, మైసూర్, హళేబీడు, చిక్కమంగళూరు, హంపి, గోవా తదితర నగరాల్లో పర్యటించి బెంగళూరుకు చేరుకుంటుంది. ప్రైడ్ ఆఫ్ కర్నాకట రైలు ఈ ఏడాది డిసెంబరు 14 అలాగే 2025లో జనవరి 4, ఫిబ్రవరి 1, మార్చి–1 తేదీలలో ప్రయాణిస్తుంది. అలాగే జువెల్స్ ఆఫ్ సౌత్ పేరుతో ఐదురోజుల టూర్ రైలు బెంగళూరు నుండి మైసూర్, కాంచీపురం, మహాబలిపురం, తంజావూరు, చెట్టినాడ్, కొచ్చిన్, చేర్తాల మీదుగా పర్యటించి తిరిగి బెంగుళూరుకు చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబరు 21, 2025 ఫిబ్రవరి 15న ప్రయాణికులతో బయులు దేరుతుంది. ది గోల్డెన్ చారియట్ (The Golden Chariot) రైలు గురించి, ప్రయాణం, ఆఫర్ల గురించి మరింత సమాచారం కోసం వెబ్‌సైట్: www. goldenchariot.orgలో సంప్రదించాలని ఐఆర్సీటీసీ అధికారులు కోరారు.