Saturday, November 23, 2024
Homeనేషనల్Trivendrum: వైగా 2023లో పాల్గొన్న వ్యవసాయ శాఖా మంత్రి

Trivendrum: వైగా 2023లో పాల్గొన్న వ్యవసాయ శాఖా మంత్రి

కేరళ ప్రభుత్వ ఆధ్వర్యంలో తిరువనంతపురంలో జరుగుతున్న వైగా 2023 అంతర్జాతీయ సదస్సులో ‘వ్యవసాయ ఉత్పత్తులకు విలువలు పెంపొందించడం’ (developing value chain in agriculture ) అనే అంశంపై జరిగిన చర్చలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత వ్యవసాయమేనని, ఆహారానికి ప్రత్యామ్నాయం లేదన్నారు సింగిరెడ్డి. వ్యవసాయంలో విలువ ఆధారిత ఉత్పత్తులను పెంచడానికి వ్యవసాయ ఆధారిత స్టార్టప్ లను ప్రోత్సహిస్తున్నట్టు, వివిధ రాష్ట్రాలలో ఆయా వాతావరణ పరిస్థితులను బట్టి పండే పంటల ఆధారంగా దేశాన్ని క్రాప్ కాలనీలుగా విభజించాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
దేశంలో అన్ని అనుకూల పరిస్థితులు ఉన్నా సాగు అనుకూల పరిస్థితులు లేని దేశాల నుండి వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకునే దుస్థితి ఉండడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
వ్యవసాయ ఉత్పత్తులకు విలువను పెంచే ఆహారశుద్ది పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడం, పటిష్టమైన మార్కెటింగ్ వ్యవస్థను రూపొందించ లేకపోవడం శోచనీయమని నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
సుస్థిర వ్యవసాయం దిశగా, విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను పెంపొందించడానికి ఈ సదస్సు తగిన సూచనలు చేస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News