Hyderabad| హైదరాబాద్‌లోని రోడ్లు ఒక్కసారిగా ఎరుపెక్కాయి. ఎవరైనా హత్యకు గురయ్యారా..? లేక గొడవ ఏమైనా జరిగిందా..? అని ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు. అసలు ఏం జరుగుతుందో అని కంగారు పడ్డారు. జీడిమెట్ల(Jeedimetla) పారాశ్రామికవాడను అనుకుని ఉన్న సుభాష్‌నగర్ డివిజన్ వెంకటాద్రి నగర్‌లో రోడ్లపై ఎరుపు రంగులో నీరు పారింది. ఆ నీటి నంచి వచ్చే దుర్గంధంతో ప్రజలు శ్వాస తీసుకునేందుకు కూడా తీవ్ర ఇబ్బంది పడ్డారు.
దీంతో ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందని స్థానికులు ఆరా తీశారు. ఓ మ్యాన్ హోల్ నుంచి నీరు ఎరుపు రంగులో ఉబికి వస్తున్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతంలో గోదాం నిర్వాహకులు రసాయనాలను నేరుగా డ్రైనీజీలో కలిపేస్తున్నారని మండిపడుతున్నారు. అందుకే నీరు ఎరుపు రంగులో పారి తీవ్ర వాసన వచ్చిందని చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.