Saturday, October 5, 2024
Homeచిత్ర ప్రభPawan Kalyan : 'హరి హర వీరమల్లు' సిసినిమాపై సూపర్ అప్డేట్ ఇచ్చిన చిత్ర యూనిట్..

Pawan Kalyan : ‘హరి హర వీరమల్లు’ సిసినిమాపై సూపర్ అప్డేట్ ఇచ్చిన చిత్ర యూనిట్..

- Advertisement -

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ కాన్సెప్టుతో హరిహరవీరమల్లు సినిమాని తెరకెక్కిస్తున్నారు. రెండేళ్ల క్రితమే మొదలైన ఈ సినిమా కరోనా కారణంగా, పవన్ రాజకీయ షెడ్యూల్స్ వల్ల ఆలస్యమవుతూ వస్తుంది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన వర్క్ షాప్ ని నిర్వహించి ఈ సారి మాత్రం షూటింగ్ ఆగేదే లేదు, సమ్మర్ కి ఎలాగైనా సినిమాని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు చిత్ర యూనిట్.

ఇటీవలే రామోజీ ఫిలింసిటీలో యాక్షన్ సన్నివేశాలని తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు హరీష్ శంకర్ తన ట్వీట్ ద్వారా తెలిపారు. తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా హరిహరవీరమల్లు సినిమాపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు తమ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలతో పాటు ఓ లేఖని షేర్ చేశారు.

ఈ లేఖలో.. ”చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన నాణ్యమైన చిత్రాన్ని రూపొందించడం కాలానికి పరీక్షగా నిలుస్తుంది. సూక్ష్మమైన వివరాలు, పరిశోధన, వందలాది తారాగణం మరియు సిబ్బంది యొక్క అపారమైన కృషి అవసరమవుతుంది. అక్టోబర్ చివరి వారం నుండి షెడ్యూల్ ప్రకారం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్‌లో ‘హరి హర వీరమల్లు’ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు 900 మంది నటీనటులు మరియు సిబ్బంది చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ‘హరి హర వీరమల్లు’ ఒక మైలురాయి చిత్రం అవుతుందని మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులంతా సంబరాలు జరుపుకుంటారని మేము చాలా నమ్మకంగా ఉన్నాము. వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి మేము చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నంలో ముందుకు సాగడానికి మీ అందరి ప్రేమ, మద్దతు మాకు ఇలాగే నిరంతరం అందిస్తారని కోరుకుంటున్నాం.” అని తెలిపింది.

దీంతో పవన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 900 మందితో షూటింగ్, యాక్షన్ సీన్స్ అంటే సినిమా భారీగానే ఉండబోతుందని అంచనా వేస్తున్నారు. ఈ అప్డేట్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. మరి అనుకున్నట్టే హరిహరవీరమల్లు సినిమాని సమ్మర్ కి రిలీజ్ చేస్తారో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News