Tuesday, November 26, 2024
HomeతెలంగాణConsitution Day Celebrations: తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం వేడుకలు

Consitution Day Celebrations: తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం వేడుకలు

75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి(TGPCB) ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం(Consitution Day) వేడుకలు నిర్వహించారు. రాజ్యాంగం నిర్దేశించిన విలువలను పరిరక్షిస్తామని ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ జి.రవి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య భారతదేశంలో రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను వివరించార. న్యాయబద్ధమైన సమ్మిళిత సమాజాన్ని ప్రోత్సహించే విలువలను పరిరక్షించడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని పునరుద్ఘాటించారు. రాజ్యాంగంలోని నిబంధనలకు అనుగుణంగా పర్యావరణం కాపాడటంలో పొల్యూషన్ బోర్డు అంకితభావంతో పనిచేస్తుందని తెలిపారు.

ఇక జాయింట్ చీఫ్ ఎన్విరాన్‌మెంటల్ సైంటిస్ట్ డాక్టర్ ఎం.సత్యనారాయణరావు సిబ్బంది చేత రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగంలోని న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం పాటిస్తామని సామూహిక ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వృత్తి జీవితంలోనే కాకుండా రోజు వారీ కార్యక్రమాల్లో రాజ్యాంగ హక్కులు, విలువలకు కట్టుబడి ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడాలని, పచ్చదనం పెంపునకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ బి.రఘు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News