Konda Surekha| తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోదరుడు జగదీశ్వర్ రెడ్డి, రజిత దంపతుల కుమార్తె వివాహం అంగరంగ వైభవం జరిగింది. శంషాబాద్‌లోని జీఎంఆర్ అరీనా కళ్యాణమండపంలో జరిగిన జగదీశ్వర్ రెడ్డి కుమార్తె రుత్విక రెడ్డి, అభిజిత్ రెడ్డిల వివాహానికి అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు.
- Advertisement -
నూతన వధూవరులకు పుష్పగుచ్ఛాన్ని అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతం ఇద్దరిని నిండు మనసుతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వివాహ వేడుకకు హాజరైన పలువురు మంత్రి సురేఖతో సెల్ఫీలు దిగి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.