Keerthy Suresh| తాను పెళ్లి చేసుకోబోయే ప్రియుడిని అభిమానులకు హీరోయిన్ కీర్తి సురేశ్ పరిచయం చేశారు. ప్రియుడి ఆంటోనీతో దిగిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దాదాపు 15 సంవత్సరాల తమ అనుబంధం ఇకపై జీవితాంతం కొనసాగనుందని తెలిపారు. దీంతో సెలబ్రెటీలు, అభిమానులు కీర్తికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కాగా కీర్తి సురేశ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఆమె తండ్రి సురేశ్ కుమార్ స్పందించారు. వారిద్దరు స్కూల్ డేస్ నుంచి మంచి ఫ్రెండ్స్ అని.. వీరి అనుబంధం గత 14 ఏళ్లుగా సాగుతోందని పేర్కొన్నారు. వారిష్టం ప్రకారమే ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో డిసెంబర్ 11 లేదా 12న వివాహం జరుగుతందని స్పష్టం చేశారు. గోవాలోని ఓ పెద్ద రిసార్ట్లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. ఇరు కుటుంబాలతో పాటు సన్నిహిత బంధువులకు మాత్రమే ఈ వేడుకకు ఆహ్వానం పలకనున్నామని తెలిపారు.
కాగా చెన్నైకు చెందిన ఆంటోనీ ఇంజనీరంగ్ పూర్తి చేసి గల్ఫ్ కంట్రీ ఖతార్లో జాబ్ చేశారు. అనంతరం ఇండియాకు తిరిగి వచ్చి చెన్నై, కేరళలో వ్యాపారాలు ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన ఆస్తి రూ.300కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.