నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న తీవ్రవాయుగుండం
ప్రస్తుతానికి ట్రింకోమలీకి 100 కిమీ, నాగపట్నానికి 320 కి.మీ, పుదుచ్చేరికి 410 కి.మీ మరియు చెన్నైకి 490 కి.మీ దూరంలో కేంద్రీకృతం
రాగల 12 గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి తుపానుగా మారే అవకాశం
ఆ తర్వాత, ఇది ఉత్తర-వాయువ్య దిశగా పయనం
శనివారం (నవంబర్ 30వ తేదీ) ఉదయం ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వెంబడి కారైకాల్ మరియు మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం
దీని ప్రభావంతో మూడు రోజులు (28-30) దక్షిణకోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు,
రాయలసీమలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం
మిగిలినచోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం
దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35-45 కి.మీ గరిష్టంగా 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు
మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి