Tirumala| తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని మూడు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటలకు పైగా సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు.
- Advertisement -
ఇక బుధవారం 67,626 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 22,231 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కలు చెల్లించుకున్నారు. భక్తులు చెల్లించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.75 కోట్లు వచ్చింది. మరోవైపు ఏపీ, తమిళనాడులో ఫెంగల్ తుఫాన్(Cyclone Fengal) ప్రభావంతో పాటు చలి తీవ్రత కారణంగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య కాస్త తగ్గింది.