MLC Kavitha| మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “సమాజంలో కులవివక్ష, అసమానతలు రూపుమాపడానికి అలుపెరుగని కృషి చేసిన సంఘ సంస్కర్త, మహిళా విద్యను ప్రోత్సాహించిన మార్గదర్శి, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం పరితపించిన మహాత్మ జ్యోతి రావు పూలే వర్థంతి సందర్భంగా ఘన నివాళులు..అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మరోసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను” అని తెలిపారు.
కాగా గతంలో కూడా అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని కవిత పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమె అరెస్ట్ అయి 5 నెలల పాటు జైలు జీవితం గడిపారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కొన్ని రోజుల పాటు సైలెంట్‌గా ఉండిపోయిన కవిత.. మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్‌గా మారుతున్నారు.