Thursday, November 28, 2024
Homeట్రేడింగ్Value mart in Nacharam: భారతదేశంలోనే అతిపెద్ద హైపర్ మార్ట్ వాల్యూ జోన్ ఇప్పుడు...

Value mart in Nacharam: భారతదేశంలోనే అతిపెద్ద హైపర్ మార్ట్ వాల్యూ జోన్ ఇప్పుడు నాచారంలో

షాప్, ఈట్, ఎంజాయ్..

పటాన్ చెరులో అద్భుత విజయం సాధించిన హైపర్మార్ట్ వాల్యూజోన్, మరోసారి చరిత్ర సృష్టించేందుకు నాచారంలో సిద్ధమైంది. హైపర్ మార్ట్ బ్రాండ్ అంబాసిడర్ గా హైపర్ మార్ట్ తో అనుబంధం ఉన్న ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి బాలకృష్ణ ఈరోజు ప్రారంభించారు.

- Advertisement -

ఒకేచోట సమగ్ర రీటైల్ షాపింగ్

వాల్యూజోన్ హైపర్ మార్ట్ ఆలోచన పి. వెంకటేశ్వర్లు, ఎస్. రాజమౌళి, టి. ప్రసాదరావు, దివంగత పి. సత్యనారాయణలది. మారుతున్న రిటైల్ ఫార్మాట్ ను రూపొందించాలనే వారి సామూహిక దృష్టి ఈ విస్తారమైన షాపింగ్ గమ్యస్థానంగా మారింది. ఫ్యాషన్, కిరాణా సరుకులు, ఫుట్వేర్, లగేజ్, ఫర్నిషింగ్, స్టేషనరీ, సాధారణ సరుకులతోపాటు ప్రఖ్యాతి గాంచిన అన్ని బ్రాండ్లను వినియోగదారులకు అందించడంపై దృష్టి సారించి, ఒకేచోట సమగ్ర రిటైల్ షాపింగ్ అనుభవాన్ని అందిస్తోంది వాల్యూజోన్.

షాప్, ఈట్, ఎంజాయ్

నాచారంలో ప్రారంభించిన వాల్యూజోన్ హైపర్ మార్ట్ ను పరిసర ప్రాంతాల వారు అనేక రవాణా మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఇది కుటుంబాలకు ఆదర్శవంతమైన షాపింగ్ గమ్యస్థానంగా మారుతుంది. రాయితీ బ్రాండెడ్ ఉత్పత్తుల ద్వారా వినియోగదారులు రోజంతా షాపింగ్ చేయగలిగేలా, ఫ్యాషన్, ఆహారం, వినోదాలతో కూడిన ప్రత్యేకమైన రిటైల్ అనుభవాన్ని ఆస్వాదించడానికి ఔట్లెట్ లా ఈ బ్రాంచ్ ను రూపొందించటం విశేషం.

ఇదో గొప్ప ఫార్మాట్: బాలయ్య

వాల్యూజోన్తో గల అనుబంధం గురించి నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, “వాల్యూజోన్ ఖచ్చితంగా గొప్ప రిటైల్ ఫార్మాట్. దాని ఉత్పత్తుల శ్రేణి, షాపింగ్ అనుభవం, సాటిలేని రీతిలో హైదరాబాద్ కు గర్వకారణంగా మారుతోంది. వాల్యూజోన్లోని కలెక్షన్లు, బ్రాండ్లు, ఆహ్లాదకరమైన సమయం వినియోగదారుల కోసం వేచి ఉన్నాయి” అని వాల్యూ జోన్ బ్రాండ్ అంబాసిడర్ బాలయ్య పేర్కొనటం విశేషం.

అతి పెద్ద హైపర్ మార్ట్ లో షాపింగ్

భారతదేశపు అతి పెద్ద హైపర్ మార్ట్లో షాపింగ్ అనుభవాన్ని పొందేలా ఇప్పుడు మన నాచారంలో అందుబాటులోకి వచ్చింది వాల్యూ మార్ట్. రోజువారీ అన్ని అవసరాలు, ప్రత్యేక సందర్భాల కోసం వన్ స్టాప్ ఫ్యామిలీ షాప్ గా వాల్యూ మార్ట్ లో అన్ని వయసుల వారికి, అన్ని సందర్భాలకు అవసరమైన వస్తువులన్నీ అందుబాటులో ఉన్నాయి.

365 రోజులూ ఆఫర్సే

వాల్యూ మార్ట్ పేరుకు తగ్గట్టుగానే వాల్యూ ఫర్ మనీ ఇచ్చేలా నిర్వాహకులు నడుపుతుండటం హైలైట్. ఫ్యాషన్, నిత్యావసర సరుకులు, సాధారణ వస్తువులపై 365 రోజులూ అద్భుతమైన ఆఫర్లు ఉండటమే దీనికి కారణం. 1.7 లక్షల చదరపు అడుగులతో మునుపెన్నడూ లేని షాపింగ్ అనుభూతి కోసం వాల్యూ మార్టుకు పదేపదే వచ్చేలా ఈ సూపర్ మార్కెట్ ఆకట్టుకోవటం ఖాయం.

సౌకర్యవంతమైన షాపింగ్

వెడల్పైన ఐల్స్, హ్యాసిల్ ఫ్రీ చెకౌట్ కోసం 40+ క్యాష్ కౌంటర్లులో 2000+ ఉత్పత్తులు, ఒక వస్తువు కొనుగోలుపై మరొకటి పొందే అవకాశం, విస్తృతమైన స్టాక్ తో పెద్ద మొత్తంలో ఆదా, 10,000+ కిరాణా వస్తువులు, మీ అవసరాలన్నీ ఒకేచోట, బహుళ వస్త్రాల బ్రాండ్ల నుండి 1000+ ఉత్పత్తులు, మీ ఇంటిని స్టైలిష్ గా, సౌకర్యవంతంగా చేసేందుకు అవసరమైన యావత్ సామగ్రి ఇక్కడ సరసమైన ధరల్లో లభిస్తోంది. పురుషుల కొరకు ఎంచుకోవడానికి 100 కంటే ఎక్కువ జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు, మహిళా కస్టమర్ల ఛాయిస్ కు సూటబుల్ గా 2000+ రకాల సిల్క్ చీరలు వంటివన్నీ వాల్యూ మార్ట్ స్పెషాలిటీలు.

  • వాల్యూజోన్ ను హైదరాబాద్ నగరంలో, బయట పలు ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News