Yashoda : స్టార్ హీరోయిన్ సమంత చాలా గ్యాప్ తర్వాత ఇటీవలే మెయిన్ లీడ్ లో యశోద అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. సరోగసీ, హాస్పిటల్స్ లో జరిగే అక్రమాలని ఇందులో కథాంశంగా తీసుకున్నారు. ఈ సినిమాలో సమంత అద్భుతంగా నటించి, యాక్షన్ సీన్స్ లో కూడా అదరగొట్టి ప్రేక్షకులని మెప్పించింది.
తమిళ దర్శకులు హరి-హరీష్ ఈ సినిమాని తెరకెక్కించగా శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన యశోద సినిమా నవంబర్ 11న థియేటర్స్‌లో రిలీజయి మంచి విజయం అందుకుంది. యశోద సినిమా ఇప్పటికే దాదాపు 40 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. యశోద సినిమాని త్వరలోనే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో సమంతకి, యశోద చిత్రయూనిట్ కి కోర్టు షాకిచ్చింది.
యశోద సినిమాలో సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్‌కు ‘ఈవా’అని పేరు పెట్టారు. ఆ హాస్పిటల్ లో అన్ని అక్రమాలు జరుగుతున్నట్టు సినిమాలో చూపించారు. అయితే బయట నిజంగానే ఈవా అనే ఓ హాస్పిటల్ ఉంది. దీంతో ఈ సినిమా వల్ల మా హాస్పిటల్ పేరు దెబ్బతింది అంటూ ఈవా హాస్పిటల్ యాజమాన్యం కోర్టుకెక్కింది. యశోద సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయకుండా ఆపాలని కోరింది. కేసుని పరిశీలించిన కోర్టు యశోద సినిమా నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 19 వరకు ఓటీటీలో యశోద సినిమా రిలీజ్ చేయకూడదని, ప్రత్యర్థికి సమాధానం ఇవ్వాలని తెలియచేసి తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసింది. దీంతో యశోద చిత్ర యూనిట్ షాక్ అయ్యారు. అయితే ఇప్పటిదాకా దీనిపై యశోద సినిమాకి సమ్బబంధించిన వారెవరూ స్పందించలేదు.