Raja Singh| వివాదాస్పద వ్యాఖ్యలతో తరుచూ వార్తల్లో నిలిచే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో నెలకొన్న మతపరమైన సంక్షోభాన్ని మహాకాళ్ ఆశీస్సులతో ఎదుర్కోవాలని ఆకాంక్షించారు. 2029 కల్లా భారతదేశం హిందూ దేశం(Hindu Country)గా అవతరించే అవకాశం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం దేశంలో లవ్ జిహాద్ పెరిగిపోవడంతో పాటు గోమాంసం ఎగుమతి ఎక్కువ అవుతుందని ఆరోపించారు. దేశంలోని ఏ మసీదులో అయిన దేవాలయాలకు సంబంధతించిన ఆధారాలు దొరికితే అక్కడ గొప్ప ఆలయాన్ని నిర్మిస్తామంటూ వివాదాస్పద ప్రకటన చేశారు. అలాగే గోహత్యలను కూడా నివారిస్తామని స్పష్టం చేశారు. ఇక ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ లాంటి ప్రధాని భవిష్యత్తులో దొరకరని కొనియాడారు. దీంతో రాజాసింగ్ వ్యాఖ్యలు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.