Friday, November 29, 2024
HomeతెలంగాణKavitha: తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు: కవిత

Kavitha: తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు: కవిత

Kavitha| నవంబర్ 29 తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

- Advertisement -

“నవంబర్ 29, 2009.. తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజు. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు.. కేసీఆర్ గారు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు సిద్దమైన రోజు. తెలంగాణ జైత్రయాత్ర లేదా కేసీఆర్ శవయాత్ర.. తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ సచ్చుడో అనే సంకల్పంతో దీక్ష ప్రారంభించిన రోజు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటంలో చారిత్రాత్మక రోజైన నవంబర్ 29న తెలంగాణ జాతిపిత, ఉద్యమ నేత కేసీఆర్ గారి పోరాట స్పూర్తిని స్మరించుకుంటూ… యావత్ ప్రజానీకాన్ని జాగృతం చేస్తూ.. నేడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ‘దీక్షా దివస్’ లో పెద్ద ఎత్తున పాల్గొందాం.. జై తెలంగాణ…! జై జై కేసీఆర్..!!” అంటూ ఆమె పేర్కొన్నారు.

కాగా 2009 నవంబర్ 29న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఆయన దీక్షతో అప్పటి యూపీఏ ప్రభుత్వం డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నామని ప్రకటించింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడుగు ముందుకు పడిందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు అదే ఘటన స్ఫూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News