అక్కినేని హీరో నాగచైతన్య (Naga chaitanya), హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) త్వరలోనే ఓ ఇంటివారు కానున్నసంగతి తెలిసిందే. తాజాగా ఈ జంటకు అన్నపూర్ట స్టూడియోస్‌లో హల్దీ వేడుక ఘనంగా నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకలో కుటుంబసభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. ఈ హల్దీ వేడుకకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా డిసెంబర్ 4వ తేదీ రాత్రి 8 గంటల 13 నిమిషాలకు చైతన్య- శోభిత వివాహం జరగనుంది. ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేక సెట్ ఏర్పాటు చేస్తున్నారు. వీరిద్దరి వివాహం బ్రాహ్మణ సంప్రదాయంలో దాదాపు 8 గంటల పాటు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు కుటుంబసభ్యులు, సన్నిహితులు, కొద్ది మంది సినీ ప్రముఖలను కలిపి కేవలం 300 మందిని మాత్రమే పిలవనున్నారట.