Friday, November 29, 2024
HomeతెలంగాణBreaking: లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరణ

Breaking: లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరణ

Lagcharla: లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఫార్మా విలేజ్‌ల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఆగస్టు 1న లగచర్లలోని 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

- Advertisement -

కాగా కొడంగల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఫార్మా కంపెనీకి ప్రభుత్వం ముంకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీకి భూసేకరణ కోసం జిల్లా కలెక్టర్, అధికారులు రైతులతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో కొందరు లగచర్ల రైతులు కలెక్టర్‌పై రాళ్ల దాడి చేయడం సంచలనం సృష్టించిన విషయం విధితమే. ఈ ఘటనలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడి వెనక బీఆర్ఎస్ నేతల హస్తం ఉందని పోలీసులు తెలిపారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి అల్లుడు కంపెనీకి చౌకగా భూములు కట్టబెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌ రావు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరించుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News