జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని సిగ్నల్ గడ్డ అంబేద్కర్, పూలే చౌరస్తాలో తాహసిల్దార్ కార్యాలయం సమీపంలో కొన్ని ఏళ్లుగా ఓ మూలకు మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం ఉంది. కనీసం దీన్ని ప్రతిష్ఠించి ఆతరువాత జయంతి, వర్ధంతి జరపాలనే సోయి కూడా లేకుండా అలాగే ఏటా పూలే జయంతి, వర్ధంతి నిర్వహిస్తుండటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
విగ్రహానికి ఒక స్థిర మైన స్థలం కేటాయించి, విగ్రహాన్ని దిమ్మెపై ఏర్పాటు చేయరా అని పట్టణవాసులు నిలదీస్తున్నారు. పూలే ఆశయాలు కొనసాగించాలనే రాజకీయ నాయకులు, బిసి నాయకులు పట్టణం నడిబొడ్డున పూలే విగ్రహం ఎలా ఉందనే సంగతిని పట్టనట్టు ప్రవర్తించటం బాధాకరమని స్థానికులు వాపోతున్నారు. సిగ్నల్ గడ్డ ఫ్లైఓవర్ నిర్మాణంలో భాగంగా నైనా పూలే విగ్రహానికి ఒక స్థిరమైన స్థలాన్ని కేటాయించి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని పట్టణ ప్రజల కోరిక.