Wednesday, April 2, 2025
HomeతెలంగాణCM Revanth Reddy: రైతులకు శుభవార్త.. రుణమాఫీ డబ్బులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: రైతులకు శుభవార్త.. రుణమాఫీ డబ్బులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy| సరిగ్గా ఏడాది క్రితం ఉత్సాహంగా ఓట్లు వేసి నిరంకుశ ప్రభుత్వాన్ని దింపి ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ‘రైతు పండుగ’ కార్యక్రమంలో వివిధ కారణాలతో రుణమాఫీ కాని 3.14 లక్షల మంది రైతులకు రూ.2,747 కోట్లు విడుదల చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ రైతుల కోసం ఇప్పటి వరకు ప్రజాప్రభుత్వం రూ.54 వేల కోట్లు ఖర్చు పెట్టిందని వివరించారు. రైతులకు ఉచిత కరెంట్‌ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీది అని వెల్లడించారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని స్పష్టం చేశారు.

- Advertisement -

గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీని పూర్తి చేసిందా? అని ప్రశ్నించారు. వరి వేస్తే.. ఉరి వేసుకున్నట్లే అని గత సీఎం కేసీఆర్(KCR) అనలేదా? అన్నారు. తమ ప్రభుత్వం మాత్రం వరి వేస్తే.. రూ.500 బోనస్‌ ఇచ్చి వరి రైతులకు పండుగ తెచ్చిందని పేర్కొన్నారు. అలాగే గత ప్రభుత్వం వడ్డీతో సహా రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసిందని మండిపడ్డారు. కానీ ప్రజా ప్రభుత్వం మాత్రం ఏడాదిలో 25 లక్షల రైతు కుటుంబాలకు రూ.21వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఇంత రుణమాఫీ చేశారా? అని ప్రధాని మోదీ(PM Modi), కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు.

పాలమూరు జిల్లాలో కృష్ణమ్మ పారుతున్నా జిల్లా ప్రజల కష్టాలు తీరలేదని వాపోయారు. ఉపాధి కోసం ఎన్నో కుటుంబాలు ముంబై, హైదరాబాద్‌కు వలస పోయాయన్నారు. బూర్గుల రామకృష్ణారావు తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ పాలమూరు బిడ్డ సీఎం అయ్యారని గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News