ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం బిగ్ అలర్ట్ ఇచ్చింది. నేటి నుంచి ఉద్యోగుల హాజరులో కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అటెండెన్స్ మొబైల్ యాప్‌లో సచివాలయానికి వచ్చిన సమయం, సాయంత్రం ఇంటికి వెళ్లిన సమయం నమోదుచేయాలని ఆదేశించింది. ఈమేరకు ఉద్యోగులకు మెసేజ్‌లు పంపిస్తున్నారు అధికారులు. ఒకసారే ఎంటర్ చేస్తే ఆ రోజు ఉద్యోగి సెలవుగా పరిగణిస్తామంటూ స్పష్టంచేశారు.
కాగా గత వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగులు కార్యాలయానికి వచ్చిన సమయం లేదా… ఇంటికి వెళ్లే సమయంలో ఏదో ఒకసారి హాజరు వేసుకుంటే సరిపోయేది. అప్పుడు ఫుల్ జీతం వేసేవారు. కానీ ఇప్పుడు రెండు సమయాల్లో కూడా హాజరు వేసుకోవాలని ఆదేశించింది. దీంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు(Secretariat employees) ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా సచివాలయ ఉద్యోగుల విధుల్లోనూ కీలక మార్పులు దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.