Thursday, December 19, 2024
Homeచిత్ర ప్రభMohanlal: 'లూసిఫర్2' షూటింగ్ పూర్తి.. మోహన్ లాల్ ఎమోషనల్ పోస్ట్

Mohanlal: ‘లూసిఫర్2’ షూటింగ్ పూర్తి.. మోహన్ లాల్ ఎమోషనల్ పోస్ట్

Mohanlal| మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లూసిఫర్ 2′(Lucifer2) మూవీ షూటింగ్ పూర్తి అయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మోహన్ లాల్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.

- Advertisement -

‘లూసిఫర్ 2 మూవీ షూటింగ్ ముగిసింది.. 14 నెలల సమయం.. ఎనిమిది రాష్ట్రాలు.. యూఎస్‌, యూకే, యూఏఈ సహా దాదాపు నాలుగు దేశాలు. ఇదొక అద్భుతమైన ప్రయాణం. ప్రతి ఫ్రేమ్‌ని ఎలివేట్ చేసే టాలెంట్ పృథ్వీరాజ్ సుకుమారన్ సొంతం. స్క్రీన్‌ ప్లేతో ఈ కథకు ప్రాణం పోసిన మురళీ గోపీ, మాకు సపోర్ట్‌ చేసిన నిర్మాతలకు ధన్యవాదాలు. మమ్మల్ని ఎంతగానో ఆరాధించే అభిమానుల ప్రేమే.. మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టింది’ అని పేర్కొన్నారు. మరెన్నో విశేషాలు వెలువడనున్నాయని చెప్పారు.

కాగా పృథ్వీరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘లూసిఫర్‌’ (Lucifer). 2019లో విడుదలై సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాకు కొనసాగింపుగా ‘లూసిఫర్‌2: ఎంపురాన్‌’ తెరకెక్కించారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్‌ సుకుమార్‌, మంజు వారియర్‌, టొవినో థామస్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News