Samantha|తృతీయ జ్యువెలర్స్ అధినేత కాంతి దత్(Kanthi Dutt)ను పోలీసులు అరెస్ట్ చేశారు. సస్టైన్ కార్ట్ అనే ఓ వ్యాపార సంస్థను ప్రారంభించాడు. అందులో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని పలువురు సెలబ్రెటీలను మోసం చేశాడు. ఈ నేరగాడి బాధితుల్లో స్టార్ హీరోయిన్స్ సమంత, కీర్తి సురేష్(Keerthy Suresh), బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా వంటి ప్రముఖులు ఉండటం గమనార్హం. వీరి వద్ద నుంచి సుమారు రూ.100కోట్లకు పైగా లూటీ చేసినట్లు తెలుస్తోంది.
- Advertisement -
కాగా సమంతకు అత్యంత సన్నిహితంగా ఉండే ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి తాను కూడా మోసపోయినట్లు హైదరబాద్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాంతి దత్ కోసం తీవ్రంగా గాలించారు. ఎట్టకేలకు ఇవాళ నిందితుడిని అరెస్ట్ చేశారు.