ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అమ్మాయిలకు ఏమాత్రం రక్షణ లేదని బీజేపీ జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలు సాహు శ్రీలత అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు, మున్సిపల్ కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో మరణించిన మెడికో స్టూడెంట్ ప్రీతికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాహు శ్రీలత మాట్లాడుతూ ఉన్నతమైన చదువులు చదివి గౌరవ ప్రదమైన వృత్తిలో చేపట్టి సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్న విద్యార్థిని ఒక ఉన్మాది వేధింపులకు బలి కావడం దారుణమైన విషయమని ప్రాణాలను కాపాడే వృత్తిలో ఉండి, ఆ అమ్మాయి ప్రాణాలను బలి తీసుకున్న సైఫ్ ని కఠినంగా శిక్షించి ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ మహిళలపై అత్యాచారాలు దాడులు రోజు రోజుకు ఎక్కువయ్యాయి, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థులు అనేక వేధింపులకు ఒత్తిడిలకు గురవుతూ ప్రాణాలు తీసుకోకుండా మనోధైర్యంతో సమస్యలను పరిష్కరించాలని , ఎలాంటి సమస్య ఉన్న తల్లిదండ్రులకు, స్నేహితులకు చెప్పాలి. అంతే కానీ ప్రాణాలు తీసుకుని వాళ్ల కుటుంబానికి తీరని లోటు చేయరాదని ధైర్యంగా ముందుకు వెళ్లాలని అన్నారు. ప్రభుత్వం ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకొని వారికి న్యాయం చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.