తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల సందర్భంగా బ్రహ్మోత్సవాల వాహన సేవలలో అమ్మవారికి అత్యంత ఇష్టమైన గజవాహనం రోజున అమ్మవారి వాహన సేవకు అలంకరించేందుకు చెన్నై హిందూ ధర్మార్థ సమితి ట్రస్ట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆర్.ఆర్ గోపాల్ జీ ఆధ్వర్యంలో ఐదు గొడుగులను అమ్మవారికి కానుకగా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆలయం వెలుపల తనను కలసిన మీడియా ప్రతినిధులతో చెన్నై హిందూ ధర్మార్థ సమితి ట్రస్ట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆర్.ఆర్ గోపాల్ జీ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనం రోజున తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో గజవాహనం రోజున గొడుగులు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు.
ఈ గొడుగులను ఆలయ డెప్యూటీ ఈవో గోవింద రాజన్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, ఆర్జితం ఇన్స్పెక్టర్ చలపతి, వాహనం కీపర్ సుభాష్కర్, ప్రసాదాల ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.