Kamilla Belyatskaya| సముద్రపు అలలకు రష్యన్ నటి కొట్టుకుపోయిన ఘటన థాయ్‌లాండ్‌లో చోటుచేసుకుంది. రష్యాకు చెందిన నటి కెమిల్లా బెల్యాట్స్‌కాయ థాయ్‌లాండ్‌లోని కో స్యామ్యూయ్ ద్వీపంలోని బీచ్ ఒడ్డున యోగా చేస్తున్నారు. అప్పటిదాకా చదును బండరాయిపై ప్రశాంతంగా ధ్యానం చేస్తున్న ఆమెపై సముద్రపు అలలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. దీంతో అలలతో పాటు ఆమె సముద్రంలోకి కొట్టుకుపోయారు.
కెమిల్లాను రక్షించడానికి ఓ వ్యక్తి ప్రయత్నించినా దురదృష్టవశాత్తు ఆమె మృత్యువాత పడ్డారు. కొద్దిసేపటికే ఆమె మృతదేహం బీచ్ ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఆమె మృతదేహాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె మృతి బాధాకరం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ఎంతో ఇష్టపడే యోగా చేస్తూనే ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని పేర్కొంటున్నారు.