Harish Rao| తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో మాజీ మంత్రి హరీష్ రావుపై కేసు నమోదైంది. సిద్ధిపేటకు చెందిన చక్రధర్ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీసులకు హరీష్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు(Radha Kishan Rao)పై ఫిర్యాదు చేశారు.
గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తన ఫోన్‌ను హరీష్ రావు, రాధాకిషన్ రావు ఆదేశాల మేరకు ట్యాప్ చేశారని చక్రధర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా తనపై అక్రమ కేసులు బనాయించి మానసికంగా వేధించారని.. తన కుటుంబ సభ్యులను కూడా భయభ్రాంతులకు గురి చేశారని తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై 120 (B), 386, 409, ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.