Eknath Shinde| మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అస్వస్థతకు గురయ్యారు. గత మూడు రోజులుగా ఆయన జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో హుటాహుటిన ముంబైలోని హై జుపిటర్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన వైద్యులు అబ్జర్వేషన్‌లో ఉన్నారు. షిండేకు డెంగ్యూ, మలేరియా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చిందని… కానీ శరీరంలో తెల్లకణాలు తగ్గడంతో చికిత్స చేస్తున్నామని వైద్యులు తెలిపారు.
మరోవైపు మహారాష్ట్ర సీఎం పదవి ఎంపికపై ఇంకా సందిగ్ధత వీడలేదు. తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis)ఖాయమైనట్లు సమాచారం. ఇక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్‌నాథ్ శిందే(Eknath Shinde) ఉప ముఖ్యమంత్రి పదవిని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.