ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా 3వ రోజు మున్సిపల్, జిల్లా యువజన క్రీడల శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 కే రన్ ను పట్టణంలోని మంచిర్యాల చౌరస్తా నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ జండా ఊపి ప్రారంభించారు. ఎన్టీఆర్ మినీ స్టేడియంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి సంవత్సరకాలం పూర్తి చేసుకున్నందున ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను నిర్వహించుకుంటున్నామని తెలిపారు.
ప్రతి అధికారి జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని తెలిపారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు అదనపు కలెక్టర్ పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, డిఈఓ పి. రామారావు, డి వై ఎస్ ఓ శ్రీకాంత్ రెడ్డి, డిసిఓ రాజమల్లు, తహసిల్దార్ రాజు, గిరిజన క్రీడా అధికారి భుక్యా రమేష్, పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.