తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్ల డైట్ ఛార్జీలు భారీగా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ప్రతిపాదనలు ముఖ్యమంత్రికి పంపారు సంబంధిత శాఖా మంత్రులు.
3-7వ తరగతి 1200, 8-10వ తరగతి 1400, ఇంటర్ టు పీజి 1875 రూపాయల మేర డైట్ చార్జీల పెంపుదల ఉంది. అంటే 25శాతానికి పైగా డైట్ చార్జీల పెంచారన్నమాట. మహారాష్ట్ర, యూపీ, కర్నాటక తదితర రాష్ట్రాలకన్నా అత్యధిక డైట్ చార్జీలు తెలంగాణలోనే ఉన్నట్టు మంత్రులు చెబుతున్నారు. సంక్షేమ హాస్టళ్ల డైట్ చార్జీలపై ఉన్నతాధికారులతో మంత్రులు హరీష్ రావ్, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ల భేటీ అయ్యారు. వివరాలు మరికాసేపట్లో ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనుంది.