Wednesday, December 4, 2024
Homeనేరాలు-ఘోరాలుTaJ Mahal: తాజ్ మహల్‌కు బాంబు బెదిరింపులు

TaJ Mahal: తాజ్ మహల్‌కు బాంబు బెదిరింపులు

TaJ Mahal| దేశంలో బాంబు బెదిరింపులు ఆగడం లేదు. మొన్నటి వరకు విమానాశ్రయాలతో పాటు విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు(Bomb threats) వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రఖ్యాత కట్టడాలకు ఈ బెదిరింపులు మొదలయ్యాయి. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒక్కటైన తాజ్ మహల్‌ను పేల్చేస్తామంటూ వార్నింగ్ మెసేజ్ వచ్చింది. గుర్తు తెలియని ఖాతా నుంచి ఉత్తరప్రదేశ్‌(UttarPradesh) టూరిజం కార్యాలయానికి తాజ్‌ మహల్‌ను పేల్చేస్తామంటూ ఈమెయిల్ వచ్చింది.

- Advertisement -

దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఇతర పోలీసు బృందాలతో విస్తృత తనిఖీలు చేపట్టారు. దాదాపు నాలుగు గంటల పాటు జరిపిన ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. తాజ్‌మహల్‌ చుట్టూ భద్రతను మరింత పెంచినట్లు ఏసీపీ సయీద్‌ అరీబ్‌ అహ్మద్‌ వెల్లడించారు. ఈ మెయిల్‌ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News