Thursday, December 5, 2024
HomeతెలంగాణHarish Rao: లక్ష తప్పుడు కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపను: హరీశ్ రావు

Harish Rao: లక్ష తప్పుడు కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపను: హరీశ్ రావు

Harish Rao| ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్‌ రావుపై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుపై హరీష్‌ రావు తీవ్రంగా స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

- Advertisement -

“మిస్టర్ రేవంత్ రెడ్డి అడగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు ప్రజల పక్షాన నీ మీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక సహించలేక నా మీద అక్రమ కేసులు ఎన్నో బనాయిస్తున్నావు. నీకు చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం. రుణమాఫీ విషయంలో దేవుళ్లను సైతం దగా చేసినవు అని అన్నందుకు యాదగిరి గుట్ట పోలీసు స్టేషన్‌లో తప్పుడు కేసు పెట్టించావు. ఇచ్చిన హామీలను ఎగవేస్తున్న నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అని అన్నందుకు బేగం బజార్ పోలీసు స్టేషన్‌లో తప్పుడు కేసు పెట్టించావు” అంటూ మండిపడ్డారు.

సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టుకు సైబర్ క్రైం పోలీసు స్టేషన్‌లో నా మీద సంబంధం లేని కేసు పెట్టించావు. పార్టీ కార్యక్రమంలో మాట్లాడితే కోడిగుడ్డు మీద ఈకలు పీకి, తలాతోక లేని కేసు ఒకటి మానకొండూరులో అక్రమ కేసు పెట్టించావు. నీ రెండు నాల్కల వైఖరిని బట్టబయలు చేసినందుకు, ప్రజాక్షేత్రంలో నిలదీసినందుకు తట్టుకోలేక ఇవాళ పంజాగుట్ట స్టేషన్‌లో మరో తప్పుడు కేసు పెట్టించివు. నువ్వు లక్ష తప్పుడు కేసులు పెట్టించినా, నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను. ప్రజా కోర్టులో, ప్రజా తీర్పుతో నీకు తగిన శిక్ష పడేంత వరకు ఆగను” అని ఆయన హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News