YCP Meeting| పార్టీ బలోపేతం, పార్టీ నిర్మాణంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(Jagan) దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఆయన అధ్యక్షతన తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో రేపు(బుధవారం)వైసీపీ రాష్ట్ర స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఏపీలోని అన్ని జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర రీజినల్ కో ఆర్డినేటర్లు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు హాజరుకానున్నారు. పార్టీ పరంగా కమిటీల ఏర్పాటుపై చర్చించనున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళనలకు కార్యాచరణ సిద్ధం చేయనున్నారు.
విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజల నడ్డి విరుస్తోదంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఛార్జీల పెంపుపై ఆందోళనలు ఎలా నిర్వహించాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ధాన్యం సేకరణ, రైతులకు మద్దతు ధర లభించకపోవడం, తదితర అంశాలపైనా చర్చించనున్నారు .అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ అంశాలపైనా ఇదే సమావేశంలో చర్చించనున్నారట. ప్రభుత్వం విధానాలు, పాలనపై పోరాడేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నారు.