కామారెడ్డి జిల్లాలో 36 కేసుల్లో పట్టుకున్న రూ. 3.51 కోట్ల విలువ చేసే గంజాయి, అల్పోజోలంను కాల్చివేశారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, పెద్దాక్కల్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ అమోదం పొందిన శ్రీమెడికెర్ సర్వీస్‌లో గంజాయిని దగ్ధం చేశారు.
5 పీఎస్ ల్లో 36 కేసుల్లో సీజ్ చేసిన
కామారెడ్డి జిల్లాలోని ఐదు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలోని 36 కేసుల్లో పట్టుబడిన 783.36కిలోల గంజాయి, 16.625 కిలోల అల్పోజోలం, 2.15 కేజీల డ్రై జి ఫామ్ , 0.852 గంజాయి మొక్కలను కాల్చివేశారు. నిజామాబాద్ జిల్లా డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి డిస్పోజల్ అధికారిగా ఇచ్చిన అదేశాల మేరకు కామారెడ్డి ఎక్సైజ్ సూపరిండెంట్ హన్మంతరావు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు గంజాయిని కాల్చివేశారు.
గంజాయిని డిస్పోజల్ చేసిన ఎక్సైజ్ అధికారులను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వి.బి. కమలాసన్‌రెడ్డి అభినందించారు.