NagaChaitnya| అక్కినేని హీరో నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల(Sobitha Dhulipalla) రేపు పెళ్లి చేసుకోనున్నారు. ఇప్పటికే పెళ్లి వేడుకకు సంబంధించిన పనులు పూర్తి అయ్యాయి. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరగనుంది. అయితే ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగానికి సంబంధించిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి సహా చిత్ర పరిశ్రమకు చెందిన ముఖ్యులు ఈ వేడుకలో పాల్గొననున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. వీరితో పాటు మరికొంత మంది ప్రముఖులు పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారట.
కాగా చైతన్య-శోభితల వివాహ వేడుక పూర్తి హిందూ సంప్రదాయ పద్ధతిలో జరగనుంది. దాదాపు 8 గంటల పాటు పెళ్లికి సంబంధించిన అన్ని క్రతువులు బ్రాహ్మణ పద్ధతిలో నిర్వహిస్తారట. ఇటీవల ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు కాబోయే సతీమణి గురించి చైతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెతో జీవితం పంచుకునేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం చైతూ ‘తండేల్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల కానుంది.