Tirumala| తిరుమలలో భక్తుల క్యూలైన్లను టీటీడీ(TTD) చైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu) పరిశీలించారు. భక్తులతో మాట్లాడి వారి నుంచి సలహాలు సూచనలు స్వీకరించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు.
“తిరుమలలో సామాన్య భక్తుల క్యూలైన్లను పరిశీలించాను. తొలుత ఏటీజీహెచ్ వద్ద ఉన్న స్లాటెడ్ సర్వదర్శనం ఎంట్రీ వద్ద పరిస్థితులను పరిశీలించాను. అనంతరం నారాయణగిరి షెడ్లను, దివ్యదర్శనం కాంప్లెక్స్ ను పరిశీలించాను. అక్కడ అమలవుతున్న విధానాల గురించి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నాను. దాంతోపాటే, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్ ను కూడా పరిశీలించి, భక్తుల నుంచి సూచనలు తీసుకున్నాను. త్వరలోనే దర్శన విధానాలపై సమగ్రంగా చర్చిస్తాం. సదుపాయాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటాం” అని బీఆర్ నాయుడు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఇవాళ తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించారు. ఇకపై ప్రతి మంగళవారం స్థానికులకు స్వామి వారి దర్శనం కల్పించనున్నారు. మరోవైపు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.