Thursday, December 5, 2024
HomeతెలంగాణGHMC Mayor | మేయర్ కి షాక్.. సీఎంకి చేరిన కంప్లైంట్?

GHMC Mayor | మేయర్ కి షాక్.. సీఎంకి చేరిన కంప్లైంట్?

జీహెచ్ఎంసీ మేయర్ (GHMC Mayor) గద్వాల్ విజయలక్ష్మి వ్యవహార శైలి రోజు రోజుకి చర్చనీయాంశమవుతుంది. ఫుడ్ సేఫ్టీ పేరిట ఇటీవలే మేయర్ లక్డీకాపూల్, మాసాబ్ ట్యాంక్ ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలకు చెందిన రెండు హొటళ్లపై దాడులు చేయటంతో అధికార పార్టీ నేతలు ఆమె తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడినట్లు సమాచారం. ఆ తర్వాత అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు మేయర్ వ్యవహార శైలిపై గాంధీ భవన్ లో ఫిర్యాదు చేసిన సందర్భాలున్నాయి. మేయర్ తీరుపై ప్రభుత్వంలోని కొందరు పెద్దలు, పార్టీ నేతలకు ఫిర్యాదు చేసినా, ఆమె తీరు మారకపోవటంతో అధికార పార్టీకి చెందిన కొందరు కార్పొరేటర్లు, నేతలు నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు వార్తలు బయటకి వస్తున్నాయి.

- Advertisement -

చికెన్ సెంటర్ల తనిఖీలతో పాటు ఇతర కార్పొరేటర్ల డివిజన్లలో కూడా మేయర్ జోక్యం చేసుకోవటం, మరి కొన్ని ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు, అనుమతులున్న నిర్మాణాల వద్దకు మేయర్ స్టాఫ్ అంటూ కొందరు వెళ్లి బెదిరించిన ఘటనలతో మజ్లీస్ పార్టీ నేతలతో పాటు తాజాగా అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు, నేతల ఫిర్యాదులతో సర్కారు కూడా మేయర్ పై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

Phone Tapping | ‘నా భార్యతో మాట్లాడిన కాల్స్ కూడా రికార్డ్ చేశారు’

అంతకు ముందు జీహెచ్ఎంసీ మేయర్ (GHMC Mayor) నగరంలోని రెండు చికెన్ సెంటర్లలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తో కలిసి తనిఖీలు నిర్వహించి, చికెన్ సెంటర్లలో నెలకొన్న అపరిశుభ్రమైన వాతావరణంపై తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెల్సిందే. ఆ రెండు చికెన్ సెంటర్లను వెంటనే సీజ్ చేయాలని అధికారులకు ఆదేశించటంతో వారు చికెన్ వ్యర్థాలను తరలించటంతో పాటు చికెన్ సెంటర్ లోని చికెన్ ను కూడా సీజ్ చేయటం, విషయం తెల్సుకున్న కొందరు మజ్లీస్ నేతలు హుటాహుటీన అక్కడకు చేరుకుని, మేయర్ తనిఖీలపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేయటంతో పాటు అధికారులు సీజ్ చేసిన చికెన్ ను తిరిగి వ్యాపారులకు ఇప్పించారు.

ఇలా ఎప్పుడూ కాలేదు…

జీహెచ్ఎంసీ నూతన ఆర్థిక సంవత్సరం (2025-26) కు సంబంధించి అధికారులు రూ.3840 కోట్లతో రూపొందించిన వార్షిక బడ్జెట్ ముసాయిదాపై ఆమోదం కోసం ఈ నెల 30వ తేదీన జరిగిన స్టాండింగ్ కమిటీ లో మజ్లీస్ పార్టీ సభ్యులు బడ్జెట్ రియలిస్టిక్ గా లేదని తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెల్సిందే. గడిచిన దశాబ్దపు కాలంలో స్టాండింగ్ కమిటీ ఎపుడూ కూడా బడ్జెట్ ముసాయిదాను తిరస్కరించిన సందర్భాల్లేవని, బడ్జెట్ పు జరిగిన స్టాండింగ్ కమిటీ వాయిదా పడటం మేయర్ సభను సక్రమంగా నిర్వహించకపోవటం వల్లేనన్నది చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News