Thursday, December 12, 2024
HomeAP జిల్లా వార్తలుకర్నూలుSrisailam: శ్రీశైలం కొత్త ఈవో బాధ్యతల స్వీకరణ

Srisailam: శ్రీశైలం కొత్త ఈవో బాధ్యతల స్వీకరణ

మాస్టర్ ప్లాన్..

శ్రీశైల భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల దేవస్థానం నూతన ఈవోగా డిప్యూటీ కలెక్టర్ ఎం. శ్రీనివాసరావు గురువారము ఆలయ పరిపాలనా భవనంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీశైలం క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక కృషి చేస్తానని తెలిపారు. భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి వహిస్తానని, దేవస్థానం మాస్టర్ ప్లాన్ అమలుకు ప్రాధాన్యతను ఇస్తానన్నారు. అనంతరం కార్యాలయ పలువురు సిబ్బంది నూతన ఈవోకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే దేవస్థానం అన్నపూర్ణ భవన్ సందర్శించి అన్న ప్రసాదం గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News