టైటిల్: పుష్ప 2 – ది రూల్
నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక, ఫాహాద్ ఫాజిల్, జగపతిబాబు, ధనుంజయ, రావు రమేష్, సునీల్, అనసూయ
పాటలు: చంద్రబోస్
యాక్షన్: పీటర్ హెయిన్, డ్రాగన్ ప్రకాష్, కిచ్చా, నవకాంత్
సినిమాటోగ్రఫీ: కూబా
ఎడిటింగ్: నవీన్ నూలీ
మ్యూజిక్: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి
కథ, దర్శకత్వం: సుకుమార్ బండ్రెడ్డి
సెన్సార్ రిపోర్ట్ : యూ / ఏ
రన్ టైం: 200 నిమిషాలు
రిలీజ్ డేట్: 5, డిసెంబర్, 2024
పరిచయం:
టాలీవుడ్ దిగ్గజ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు, సీక్వెల్, పుష్ప 2, దేశవ్యాప్తంగా అపూర్వమైన అంచనాలను సృష్టిస్తోంది. పుష్ప అనే పేరు సర్వత్రా వ్యాపించింది, మీరు ఎక్కడ తిరిగినా ప్రతిధ్వనిస్తుంది. పుష్ప 2 చుట్టూ ఉన్న అసలు సందడి ఏమిటి? ఈ చిత్రం ఆకట్టుకునే రూ. 1060 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్, రూ. 120 కోట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా మాత్రమే రాబట్టింది. పుష్పగాడి గందరగోళం ఇంతకంటే తీవ్రంగా ఉంటుందా? ఒరిజినల్ పుష్ప నుంచి వెలువడుతున్న ప్రమోషనల్ మెటీరియల్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇంత అపురూపమైన అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన పుష్ప దేవుడు బాక్సాఫీస్ని జయిస్తాడా? సమీక్షలో లోతుగా పరిశీలిద్దాం.
కథ:
కథనం విషయానికి వస్తే, పుష్ప 2 లో ముఖ్యమైన కథాంశం లేదు. ఇది మొదటి చిత్రానికి సీక్వెల్గా ఉన్నప్పటికీ, కథాంశంలో ఆశ్చర్యకరమైన పరిణామాలు లేవు. పుష్ప (బన్నీ) తన భార్య శ్రీ వల్లి (రష్మిక)తో ఎఫైర్లో నిమగ్నమై ఉంటాడు. ఈ విడతలో, అతను తన భార్య అభ్యర్థనపై ఫోటోను నిరాకరించినందుకు ముఖ్యమంత్రిని తొలగించి, 5,000 కోట్ల విలువైన డీల్ని సిద్ధం చేస్తాడు. ఎంపీ రావు రమేష్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. దీంతో మొదటి సినిమా నుంచి భన్వర్సింగ్ (ఫహద్ ఫాజిల్)తో వివాదం కొనసాగడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది ప్రతాప్ రెడ్డి (జగపతి బాబు)తో పుష్ప వాగ్వాదం మరియు పుష్ప వంటి స్థానిక స్మగ్లర్ అంతర్జాతీయ డాన్గా ఎలా ఎదగగలదనే దానిపై విచారణను కూడా ప్రేరేపిస్తుంది. అదనంగా, అతని తండ్రి మొదటి కుటుంబంతో అతని సంబంధం మరియు అతను ఆ తోబుట్టువులతో ఎలా బంధం కలిగి ఉన్నాడు అనే ప్రశ్నలు ఉన్నాయి. పుష్ప 2 ఈ ప్రశ్నలకు సమాధానాలను అందిస్తుంది.
విశ్లేషణ & డైరెక్షన్ :
పుష్ప విశ్లేషణ విషయానికి వస్తే పగతో రగిలిపోతోన్న భన్వర్సింగ్ తో సవాల్ చేసి మరీ చెప్పిన డేట్కు.. చెప్పిన టైంకు చెన్నై బోర్డర్ దాటించే సీన్ అదిరిపోయింది. సండ్ర దుంగలను లారీల్లోకి ఎక్కించి తప్పుదోవ పట్టించి… ఎర్రచందనం దుంగలను ఎడ్ల బండ్లుగా మార్చి భన్వర్ను బకరాను చేయడం హైలెట్. సరుకును తమిళనాడులోని రామేశ్వరం నుంచి సముద్రం బోర్డర్ దాటించేసి శ్రీలంక పంపే సీన్ దంచి కొట్టింది. ఎక్కడైనా సినిమా గ్రాఫ్ తగ్గుతుందా అనుకుంటోన్న టైం లోనే అదిరిపోయే ఎలివేషన్ సీన్ వస్తూ ప్రేక్షకుడిని మెస్మరైజ్ చేసేది. అందుకే 200 నిమిషాల సినిమా అయినా మరీ ల్యాగ్ అయిన ఫీలింగ్ రాలేదు. సీఎం పుష్పతో ఫొటో ఇవ్వలేదని సవాల్ చేసి చెప్పిన టైంకు సీఎంనే మార్చేయడం కూడా కన్విన్సింగ్గానే ఉంది. జపాన్ ఫైటర్లతో సినిమా స్టార్టింగ్లోనే తీసిన ఫైట్లో బన్నీ ఎలివేషన్ అయితే అదిరిపోయింది.
సీఎంను కలిసేందుకు వెళ్లినప్పుడు తన భార్య శ్రీ వల్లి కోరిక మేరకు సీఎంతో ఓ ఫొటో అడిగితే స్మగ్లర్లతో ఫొటో ఇవ్వను అంటాడు… వెంటనే ఎంపీగా ఉన్న రావూ రమేష్నే సీఎం అయిపోతున్నావు.. అని ఫొటో తీసుకునే ఎలివేషన్ సీన్ అదిరిపోయింది. సీఎం సీటు కోసం రావు రమేష్ను ఢిల్లీ పంపి… జగపతిబాబుతో ఫోన్లో మాట్లాడిన సీన్ అయితే గూస్బంప్స్ తెప్పించేస్తోంది. జస్ట్ ఫోన్ కలిపినోడికి రు. 5 కోట్లు… మాట్లాడినందుకు జగపతిబాబుకు రు. 25 కోట్లు ఇవ్వడం పుష్ప గాడి రేంజ్ ఏంటో చూపించింది.
స్మగ్లర్లతో డీల్ మాట్లాడుతున్న టైంలో తాను వండిన కూరలో పుష్ప ఉప్పు తగ్గిందనడం.. రష్మిక అలగడం.. వెంటనే బన్నీ ఉప్పు పంచాయితీ ఏందిరా అంటూ లోపలకు వెళ్లడం… రష్మిక ఫీలింగ్స్ వస్తున్నాయంటే… రష్మిక కాలిమీద పుష్ప మార్క్ తగ్గేదేలా స్లాగ్ ఇవ్వడం పుష్ప గాడి మార్క్ మేనరిజం కొత్తగా ఉంది. ఇక ఫీలింగ్స్ సాగంగ్లో అయితే డ్యాన్స్ చంపేశాడు. సినిమా స్టార్టింగ్ జపాన్లో ఫైట్ నుంచి ఫస్టాఫ్లో ప్రతి పది నిమిషాలకు ఓ భయంకరమైన ఎలివేషన్ షాట్ పడుతూనే వస్తోంది. అది కామెడీ అయినా.. యాక్షన్ అయినా.. బన్నీ గురించి ఎలివేషన్ అయినా.. డైలాగులు అయినా కూడా విజిల్స్ మోత మోగిపోయేలా ఉన్నాయి. ఫ్యాన్స్కు మాత్రమే కాదు.. సగటు సినీ అభిమానికి… మాస్ ఫ్యాన్స్కు అయితే విజిల్స్ మోత మోగించేశాడు.
ఫస్టాఫ్లో పుష్ప ఎంట్రీ సాంగ్ .. అటు ఫీలింగ్సే సాంగ్ రెండూ మంచి రిలీఫ్. క్రేజీ ఫీలింగ్సే సాంగ్లో బన్నీ, రష్మిక ఇద్దరూ పోటీపడి ఎనర్జీతో వేసిన స్టెప్పులు కేకో కేక అని చెప్పాలి. ఫస్టాఫ్లో ఈలలు.. కేకలతో థియేటర్లు అంతా మార్మోగితే.. సెకండాఫ్లో సెంటిమెంట్ ఎక్కువైంది. సినిమా స్టార్టింగ్ నుంచి కాస్త స్లోగా మూవ్ అవుతున్న కంప్లైంట్ ఉన్నా కూడా బోర్ కొట్టకుండా నడిపించడంలో సుకుమార్ స్క్రీన్ ప్లే బాగా వర్కవుట్ అయ్యింది. స్క్రీన్ ప్లే విషయంలో సుకుమార్ బాగా కసరత్తులు చేశాడు. జాతర ఫైట్తో పాటు ప్రతాప్రెడ్డి కొడుకు… పుష్ప సవతి అన్న కూతురును కిడ్నాప్ చేస్తే విడిపించుకునే సీన్లో వచ్చిన ఫైట్తోనే సినిమా స్కై రేంజ్కు వెళ్లిపోయింది. ఇక శ్రీలీల – బన్నీ కిస్సిక్ సాంగ్ కుమ్మిపడేసింది.
ఈ సీక్వెల్కు సుకుమార్ కోసం కథపరంగా పెద్దగా కసరత్తులు చేయలేదు. అయితే కథనంతో పాటు స్క్రీన్ ప్లే విషయంలో చాలా కసరత్తులు.. జాగ్రత్తలు తీసుకున్నాడు. ఫస్టాఫ్ అంతా పుష్ప మీద అరివీర భయంకరమైన ఎలివేషన్లతో సినిమాను నడిపిన సుక్కు సెకండాఫ్లో ఫ్యామిలీ సెంటిమెంట్, డ్రామాకు ప్రయార్టీ ఇచ్చాడు. సెకండాఫ్లో రంగస్థలంలా ఫ్యామిలీ సెంటిమెంట్ బాగా పండించాడు. అంతకుముందు వరకు తన అన్న కుమార్తెను కాపాడేందుకు ఏకంగా కేంద్ర మంత్రి ప్రతాప్రెడ్డి అన్న కుమారుడిని వదిలినట్టే వదిలి త్రిశూలంతో చంపి పైకి లేపే సీన్ మామూలు అరాచకంగా లేదు.. అరాచకానికే అమ్మ మొగుడ్రా బాబు అన్నట్టుగా ఉంది.
డైలాగుల పరంగా పుష్పను సవతి అన్న అవమానించే క్రమంలో రష్మిక భావోద్వేగంతో చెప్పిన డైలాగులు.. నటన హార్ట్ టచ్చింగ్. అత్తా నువ్వు నీ కొడుకును అంటే నువ్వు ఊరుకుంటావేమో కాని.. నా మొగుడ్ని అంటే నేను ఊరుకోను … పుష్పను ఎలివేట్ చేస్తూ పుష్ప అంటే బ్రాండ్ అని చెప్పడం సూపర్. పెళ్లాలడిగేదే నూటికో కోటికో ఓ కోరిక.. అది కూడా తీర్చని వాడు మొగుడు ఎట్ట అవుతాడు అమ్మీ లాంటివి మాస్కు మెప్పించాయి.
నటీనటుల పెర్ఫామెన్స్ :
బన్నీ యంగ్ ఎనర్జిటిక్ నటనతో అదర గొట్టేశాడు. పుష్ప 1ను మించి తన నట విశ్వరూపం చూపించాడు. ఈ పాత్ర కోసం తనను మార్చుకున్న తీరు.. ప్రతి సీన్కు డిఫరెండ్ వేరియేషన్… డైలాగ్ మాడ్యులేషన్.. రష్మికతో రొమాన్స్… యాక్షన్.. డైలాగులు చెప్పిన తీరు… ఎక్స్ప్రెషన్స్… ఎనర్జిటిక్ డ్యాన్సులు.. సరికొత్త స్టెప్పులు ఇలా చెప్పుకుంటూ పోతే బన్నీ ఇరగదీసి పడేశాడు. బన్నీ రగ్ అండ్ రఫ్ నటన నభూతోః నభవిష్యత్ అన్నట్టుగా ఉంది. రష్మిక రొమాన్స్ సీన్లలో అదరగొట్టేసింది.. రెండు. మూడు సార్లు ఫీలింగ్స్ వస్తున్నాయంటూ బన్నీ చొక్కా విప్పేయడం మాస్.. ఫ్యాన్స్తోనే కాదు.. సోపాల్లో ఉన్న క్లాస్ ఫ్యాన్స్తోనూ ఈలలు వేయించింది. పుష్ప భార్య పాత్రలో ఫస్ట్ పార్ట్ కంటే కూడా పరిణితి ఉన్న పాత్రలో బాగా నటించారు.
ఫాహాద్ ఫాజిల్కు సారీ చెప్పి ఆవేదనతో రగిలిపోయి తిరిగి వెనక్కి వచ్చి అదే ఫాహాద్ను స్విమ్మింగ్ ఫూల్లోకి తోసి మరీ అదే నీటిలో యూరిన్ పోసే సీన్కు విజిల్స్ మోత ఆగలేదు.. అసలు సుకుమార్కు వచ్చిన ఈ ఆలోచన మామూలుగా లేదు. పుష్ప గాడు సారి చెపితే ఎలా ఉంటుందో వీరంగం చేసి చూపించాడు. ఫాహాద్ ఫాజిల్కు కౌంటర్గా దమ్ముంటే పట్టుకోరా అంటూ తొడచరిచి సవాల్ చేయడం సూపర్ కిక్ ఇచ్చింది. స్క్రీన్ ప్లేలో ప్రతి పదినిమిషాలకు ఓ హై ఎలిమెంట్ ఉండేలా చేసిన మ్యాజిక్ బాగా వర్కవుట్ అయ్యింది. ఫాహాద్ ఫాజిల్ పుష్ప మీద పగతో రగిలిపోయే పాత్రలో బాగా నటించాడు. పుష్ప యూరిన్ పోసినా… నీటిలో నానినా.. పుష్ప బట్టలు విప్పిస్తే అవమానంతో రగిలిపోయినా.. ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఫాహాద్లో నటుడిని మరింత కొత్తగా ఆవిష్కరింపజేశాయి. జగపతిబాబు, రావు రమేష్ పాత్రలకు న్యాయం చేశారు. జగపతిబాబు కంటే ఎంపీగా రావు రమేష్ పాత్రకే మంచి స్కోప్ ఉంది.
మంగళం శ్రీను భార్యగా దాక్షాయిణి పాత్రలో పుష్పపై పగ తీర్చుకునే పాత్రలో అనసూయ నెగటివ్ షేడ్స్ పాత్రలో మెప్పించింది. ఈ నెగటివ్ రోల్ ఖచ్చితంగా క్లిక్ అవుతుంది. అనసూయకు భవిష్యత్తులో ఈ తరహా నెగటివ్ రోల్స్ ఎక్కువుగా రావడం ఖాయం. ఇక సునీల్ ఫస్టాఫ్లో తన పాత్రను కొనసాగించినా.. ఎందుకో అనసూయ పాత్రతో పోలిస్తే తేలిపోయాడు. ఓ సీన్లో అనసూయ నా మొగుడు చేతకానోడు అన్న డైలాగ్ సునీల్ను ఉద్దేశించి చెపుతుంది.. నిజానికి అనసూయ పాత్రతో పోలిస్తే సునీల్ డమ్మీ భర్త కాదు.. సినిమాలో డమ్మీ అయిపోయాడు.
టెక్నికల్గా ఎలా ఉందంటే…
రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ పాటలు రిలీజ్కు ముందే సినిమాకు హైప్ తెచ్చాయి. థియేటర్లో స్క్రీన్ మీద ప్రతి సాంగ్ను ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. జాతర సాంగ్ చూస్తుంటే పూనకాలు లోడింగ్ అయినట్టే ఉంది. ఆ డ్యాన్సులు… ఆ స్టెప్పులు మూమెంట్స్ అదిరిపోయాయి. నేపథ్య సంగీతం దేవిశ్రీ తో పాటు కొన్ని సీన్లను సీఎస్ సామ్ ఇద్దరూ ఇచ్చారు. పాటలతో పోలిస్తే నేపథ్య సంగీతం ఆ స్థాయిలో లేదు. దేవిశ్రీ నేపథ్య సంగీతం విషయంలో అంత ఎఫర్ట్ పెట్టాలదేన్న కంప్లైంట్ ఉన్నందునే మైత్రీ వాళ్లు మరో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లను తీసుకున్నారు… ఇది నిజం అని సినిమా చూశాక అర్థమైంది. నేపథ్య సంగీతం అనుకున్న స్థాయిలో లేదు. నవీన్ నూలి ఎడిటింగ్ కొన్ని సీన్లను ట్రిమ్ చేయాల్సింది అనిపించినా సుకుమార్ స్క్రీన్ ప్లే ప్రకారం ఏ సీన్ కట్ చేస్తే కథకు ఎక్కడ లింక్ తెగిపోతుందో అన్నట్టుగా ఉంది.
కథకు మరీ అంత ముఖ్యం కాని కొన్ని సీన్లను అయినా ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. సెకండాఫ్లో కొన్ని సీన్లు ట్రిమ్ చేయవచ్చు. బన్నీ ఎలివేషన్ల మీద బాగా కాన్సంట్రేషన్ చేసే క్రమంలో యాక్షన్ సీన్లు బాగా డిజైన్ చేసుకున్నారు. జపాన్లో ఫైట్… జాతర ఫైట్ కంపోజ్ బాగా కుదిరింది. సినిమాటోగ్రఫీ రిచ్గా.. కలర్ఫుల్గా ఉంది.. ఎర్రచందనం ఛేజింగ్ సీన్లను నైట్ మోడ్లో తీయడం హైలెట్. పాటల్లోనూ విజువల్స్ అదిరాయి. ఇక మైత్రీ వాళ్ల నిర్మాణ విలువల్లో ఎక్కడా వంక పెట్టలేం… ఏ సీన్ విషయంలోనూ రాజీలేకుండా ఖర్చు పెట్టి పాన్ ఇండియా స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా పుష్ప 2ను నిర్మించాయి. ఈ సినిమా తర్వాత మైత్రీ బ్యానర్ వేల్యూ జాతీయ స్థాయిలో మార్మోగడం ఖాయం.
ఫైనల్గా…
పుష్ప 2 అల్లు అర్జున్ నటనకు విశ్వరూపం.. పెద్దగా మలుపులు లేని కథకు సుకుమార్ కళ్లుచెదిరే ఎలివేషన్లతో మైండ్బ్లాక్ అయ్యే సీన్లతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి పడేశాడు. బన్నీ ఎలివేషన్ల విశ్వరూపమే ఈ పుష్ప 2. ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందనడంలో డౌటే లేదు.
పుష్ప 2 ‘ రేటింగ్: 3.25 / 5