https://www.instagram.com/p/DDJREa1vp2R/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again
దొంగ పోలీస్, ప్రేమ శిఖరం వంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా యాక్ట్ చేసిన బాలీవుడ్ బ్యూటీ మమతా కులకర్ణ 25 ఏళ్ల తరువాత ఇండియాకు తిరిగివచ్చి, బాగా ఎమోషనల్ అయిన వీడియో వైరల్ అవుతోంది. 2012లో కుంభమేళాకు వచ్చి వెళ్లిపోయినట్టు, ఆతరువాత ఇప్పుడు జనవరిలో జరుగనున్న కుంభమేళా కోసం వచ్చినట్టు మమతా కులకర్ణి వివరించారు.
1990ల్లో బాజీ, కరణ్ అర్జున్ వంటి హిట్ సినిమాలతో పాపులర్ అయిన మమతా, గ్లామ్ సింబల్ గా క్రేజ్ సంపాదించుకున్నారు. ఖాన్ ల త్రయంగా బాలీవుడ్ ను ఏలుతున్న షారూఖ్, సల్మాన్, అమీర్ లతో ఆమె స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ 2000 సంవత్సరంలో ఆమె బాలీవుడ్ కు గుడ్ బై చెప్పి, విదేశాలకు వెళ్లిపోయి, అక్కడే ఉంటున్నారు. మమతా వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోయినా ఆమెపై ఎప్పటికప్పుడు రూమర్లు మాత్రం జోరుగా షికారు చేస్తుంటాయి. మమతా కులకర్ణికి ఉన్న క్రేజ్ ఆ స్థాయిలో ఉందిమరి.