71వ ఇంటర్ డిస్ట్రిక్ట్ మహిళా కబడ్డీ ఛాంపియన్షిప్ ఈనెల ఏడు నుండి పది తేదీ వరకు హైదరాబాద్ లో జరిగే కబడ్డీ పోటీలకు సన్నద్ధం కొరకు గత ఐదు రోజుల నుండి నిజామాబాద్ జిల్లా మహిళల కబడ్డీ జట్టుకు శిక్షణ శిబిరం ఈరోజు ముగిసింది. శిబిరంలో ప్రాబబుల్స్ 20 మంది క్రీడాకారుల నుండి ఈరోజు 12 మంది ప్రతిభ కలిగిన క్రీడాకాలను ఎంపిక చేశారు.
ఎంపికైన వారు వీరే
నిజామాబాద్ జిల్లా మహిళా కబడ్డీ క్రీడాకారిణిల పేర్లు గోదావరి కెప్టెన్, సాయి దివ్య, స్నేహ, పల్లవి, మధుప్రియ, స్నేహ, వెన్నెల, రోహిళ, చరణ్య, సహస్ర, నికిత, తేజస్వలు ఎంపిక అయినట్లు ప్రధాన కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా కార్యదర్శి కే. గంగాధర్ రెడ్డి ఎంపికయినా క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి లో జరిగే టోర్నమెంట్ లో రాణించి జిల్లా జట్టును గెలిపించి, జిల్లాకు, కబడ్డీ సంఘానికి పేరు తీసుకురావాలన్నారు. ఎంపికైన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఎంపిక కానీ క్రీడాకారులు నిరుత్సాహపడకుండా శిక్షణ పొంది మళ్ళీ జట్టులోకి రావడానికి కృషి చేయాలని సూచించారు.
ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నిజామాబాదు లయన్స్ క్లబ్ చైర్మన్ కెసిపి సాగర్ రెడ్డి, స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ అంజయ్య, ఉస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గంగారెడ్డి, ముపకల్ మండల్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కొమ్ముల నరసయ్య, స్పోర్ట్స్ అకాడమీ సభ్యులు మునురుద్దీన్, నరసయ్య, టి. సాయన్న, గంగారం, సంజీవ్, థామస్, నరేందర్, రిటైర్డ్ టీచర్ గోపీనాథ్, కనకయ్య, సీనియర్ కబడ్డీ జాతీయ క్రీడాకారులు ఎలేటి రాములు, ప్రదీప్, ప్రేమ్ కుమార్, రాజ్ కుమార్, హరీష్ టీం మేనేజర్ కోచ్, సాయిలు, అరవింద్ లు పాల్గొన్నారు.