ఫ్యాషన్ల సరికొత్త ఏకైక గమ్యం విచ్చేస్తోంది రామచంద్రాపురం సౌత్ ఇండియా షాపింగ్మాల్ వారి 37వ షోరూమ్ వచ్చింది. అటు సంప్రదాయాన్నీ, ఇటు ఆధునిక జీవన శైలినీ మేళవించి, అన్ని తరాల అభిరుచులనూ ప్రతిబింబించే సరికొత్త వస్త్ర జగత్తును సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బీహెచ్ఈఎల్-రామచంద్రాపురం, సాయినగర్ కాలనీలో వస్త్ర ప్రియుల కోసం ఆవిష్కరించింది.
శ్రీలీల చేతుల మీదుగా
శ్రీలీల ఈ షోరూంను ప్రారంభించారు. ఇనాగురల్ ఆఫర్ కింద కాస్ట్ టు కాస్ట్ సేల్స్ తో కస్టమర్లను ఆకట్టుకుంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ఏకంగా రూ. 150 కనీస ధరతో కలెక్షన్స్ అందుబాటులో ఉంచింది. వివాహాది శుభకార్యాలు మొదలుకుని, ప్రత్యేక పండుగల వరకు అన్ని తరాలను, తరగతులను అలరించే వైవిధ్యభరిత వస్త్రశ్రేణిని అందుబాటులోకి తెచ్చింది.
సంస్థ డైరెక్టర్ సురేశ్ శీర్ణ మాట్లాడుతూ, “రామచంద్రాపురంలో మా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 37వ షోరూము శుభారంభం చేయడం మాకెంతో ఆనందదాయకం, రామచంద్రాపురం వాసులు కోరుకునే నాణ్యతకు, నవ్యత్వానికీ పెద్దపీట వేసి, వారి అభిరుచులను అడుగడుగునా ప్రతిబింబించే వైవిధ్యభరిత వస్త్రశ్రేణిని, షాపింగ్ అనుభూతిని మీ గృహాలకు ఎంతో చేరువగా తీసుకురావటం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాం” అన్నారు.
సంస్థ మరో డైరెక్టరైన అభిమన్యు మాట్లాడుతూ- “పర్వదినాలకు, భారతీయ సంప్రదాయ కలెక్షన్లకు తమ షోరూమ్ విశేషమైన కేంద్రంగా, ఆకర్షణీయ షాపింగ్ గమ్యంగా స్థానిక కొనుగోలుదారుల అభిమానాన్ని తప్పకుండా చూరగొంటుందని” అన్నారు.
మరో డైరెక్టర్ రాకేశ్ “మా షోరూమ్లో అన్ని రకాల వస్త్రాలు- ధరలోనూ, నాణ్యతలోనూ, వస్త్రప్రియుల అభిరుచులను ప్రతిబింబిస్తూ, వారిని అలరించడంలోనూ తమదైన ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా అన్నిరకాల ఆదాయవర్గాల వారికీ అందుబాటులో ఉండటం వీటి ప్రత్యేకత” అన్నారు.
ఇంకో డైరెక్టర్ కేశవ్ మాట్లాడుతూ, “వైవిధ్యభరితమైన వస్త్రాలను కోరుకునే కొనుగోలుదారులు అతిపెద్ద సంఖ్యలో ఉన్న భారీ పారిశ్రామిక ప్రాంతంలో మా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 37వ షోరూమ్ను శుభారంభం చేయటం మాకు గర్వకారణం, ఆనందకరం. స్థానిక కొనుగోలుదారుల నుంచి లభిస్తున్న ప్రోత్సాహం సంతోషదాయకం. వారు కోరుకునే ప్రతి వెరైటీని అందించేందుకు మేము ఆసక్తితో ఎదురు చూస్తున్నాం” అన్నారు.