నవదంపతులు నాగచైతన్య-శోభిత ధూళిపాళ శ్రీశైలంలో దర్శనానికి వచ్చారు. నూతన వధూవరులు నాగ చైతన్య, శోభిత లతో కలిసి అక్కినేని నాగార్జున శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనార్థం క్షేత్రానికి విచ్చేసిన వీరికి ఆలయ ఈవో శ్రీనివాస రావు, వేద పండితులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. శ్రీ స్వామి అమ్మవార్లకు అక్కినేని నాగార్జున, నూతన వధూవరులు నాగ చైతన్య, శోభితలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం వేద ఆశీర్వచన మండపంలో వేద పండితులు వీరికి వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీ స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. హీరో నాగార్జున, నాగ చైతన్యలతో సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు, స్థానికులు పోటీ పడ్డారు. స్థానిక సీఐ ప్రసాదరావు భద్రతా ఏర్పాట్లు చేశారు.