Saturday, October 5, 2024
Homeనేషనల్Anand Mahindra : టీమ్ వ‌ర్క్ ఉంటే ఎంత‌టి అద్భుతాన్నైనా ఆవిష్క‌రించ‌గ‌లం

Anand Mahindra : టీమ్ వ‌ర్క్ ఉంటే ఎంత‌టి అద్భుతాన్నైనా ఆవిష్క‌రించ‌గ‌లం

Anand Mahindra : ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మ‌హీంద్ర సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర‌మైన‌, స్పూర్తివంత‌మైన పోస్టుల‌తో పాటు అప్పుడ‌ప్పుడు న‌వ్వులు పంచే ట్వీట్లు కూడా చేస్తుంటారు. తాజాగా టీమ్ వ‌ర్క్ ఉంటే ఏదైనా సాధించ‌గ‌లం అని హైలైట్‌ చేస్తూ ఓ మోటివేష‌న‌ల్ వీడియోను షేర్ చేశారు.

- Advertisement -

ఈ వీడియోలో రెండు ప‌క్ష‌లు క‌నిపిస్తాయి. ఓ ప‌క్షి లోయ‌లో ఇసుక‌ను బ‌య‌ట‌కు లాగుతుండ‌గా, మ‌రో ప‌క్షి దాన్ని వెన‌క్కు నెడుతూ ఉంటుంది. టీమ్ వ‌ర్క్ ప్రాధాన్యాన్ని ఈ వీడియో తెలియ‌జేస్తుంది.” కొన్నిసార్లు వారం మధ్యలో మీరు ప్రాజెక్టు టీమ్‌లో ఏం చేస్తున్నారో అదే వీడియోలో చూస్తున్న‌ట్లుగా అనిపించ‌వ‌చ్చు. అయితే.. మీరందరూ ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నారని గుర్తుంచుకోండి” అని ఆ వీడియో ఆనంద్ మ‌హీంద్రా క్యాప్ష‌న్ ఇచ్చారు.

ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇప్ప‌టికే నాలుగు ల‌క్ష‌ల మందిపైగా ఈ వీడియోను వీక్షించారు. చాలా మంది నెటీజ‌న్లు ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్‌తో ఏకీభ‌వించారు. టీమ్ వ‌ర్క్ ఉంటే ఎంత‌టి అద్భుతాన్నైనా ఆవిష్క‌రించ‌గ‌లం అని నెటీజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News