Thursday, December 12, 2024
HomeతెలంగాణJadcharla: దేవాలయాలు ప్రశాంతతకు నిలయాలు

Jadcharla: దేవాలయాలు ప్రశాంతతకు నిలయాలు

ఎమ్మెల్యే అనిరుధ్

దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ గాలిగోపుర నిర్మాణానికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి భూమి పూజ చేశారు. మున్సిపాలిటీకి చెందిన గంట మోహన్ రెడ్డి జయలక్ష్మి దంపతుల కుమారుడు గంట వెంకట శివరామిరెడ్డి తన తాత గంట రామ్ రెడ్డి జ్ఞాపకార్థం రూ. 35 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న జడ్చర్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ గాలిగోపురం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హాజరై భూమి పూజ చేశారు.

- Advertisement -

ఎమ్మెల్యేకు దేవాలయ పూజారులు మేల తాళాలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. భూమి పూజ అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గంట శివరామిరెడ్డి వారి తాత జ్ఞాపకార్థం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి గాలిగోపురం నిర్మించడం అభినందనీయమని అన్నారు. నేటి యాంత్రిక జీవితం గడుపుతున్న మనం విశాల భక్తి భావం ఏర్పరచుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలన్నారు.

భూమి పూజ కార్యక్రమంలో గంట జనార్దన్ రెడ్డి, గంట వెంకటేశ్వర రెడ్డి, గంట వంశీధర్ రెడ్డి, అనిల్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ కోనేటి పుష్పలత, వైస్ చైర్ పర్సన్ సారిక, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News